Siddipet: రైస్ మిల్లర్లపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్!

Siddipet: ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 19 Aug 2026 7:04 PM IST
Siddipet
X

Siddipet: రైస్ మిల్లర్లపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్!

సిద్దిపేట: రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి వేలకోట్లు సంపాదిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుబ్బాక మండలం తిమ్మాపూర్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 50 లక్షలు కూడా విలువ లేని రైస్ మిల్లలో కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం నిల్వ చేసిందని విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.విదేశాల్లో బియ్యానికి డిమాండ్ ఉండడంతో రైస్ మిల్లర్లు మిల్లల్లో ధాన్యం గింజ కూడా లేకుండా అమ్ముకుని వేలకోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగిస్తే వారు వాటిని విదేశాలకు అమ్ముకుని జల్సాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.కోట్ల రూపాయల ధాన్యాన్ని అమ్ముకుని రైస్ మిల్లర్లు బెంజ్ కార్లలో ఊరేగుతున్నారని, ఇక్కడి ధాన్యం డబ్బులతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఘాటుగా ఆరోపించారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story