Chegunta: ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
Chegunta: చేగుంట మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
Chegunta: ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
Chegunta: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వివిధ శాఖల అధికారులతో, గ్రామ సర్పంచ్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని శాఖల వారీగా సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులకు సూచించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రమాదాలకు గురయ్యే విద్యుత్ స్తంభాలు, తీగలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.




