Dubbak: తండాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Dubbak: చేగుంట మండలం కొత్త వాల్య తండాలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
Dubbak: తండాల అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Dubbak: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా చేగుంట మండలం కొత్త వాల్య తండాలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాలో నెలకొన్న పలు సమస్యలను గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రామంలో కొనసాగుతున్న డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అలాగే గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి మౌలిక వసతిని కల్పించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.తండాల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని, గ్రామీణ ప్రాంతాల పురోగతికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.




