Chegunta: రెడ్డిపల్లిలో 'సర్కార్ బాయి' షూటింగ్.. క్లాప్ కొట్టిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్!

Chegunta: చేగుంట మండలం రెడ్డిపల్లిలో "సర్కార్ బాయి" తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

Chindam Karunakar, Dubbak
Published on: 18 Jun 2026 10:55 AM IST
Chegunta
X

Chegunta: రెడ్డిపల్లిలో 'సర్కార్ బాయి' షూటింగ్.. క్లాప్ కొట్టిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్!

దుబ్బాక: చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో "సర్కార్ బాయి" తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న "సర్కార్ బాయి" తెలుగు సినిమా షూటింగ్ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మూవీ షూటింగ్‌కు క్లాప్ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.

తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణలు నిర్వహించడం ద్వారా స్థానిక కళాకారులకు, యువతకు అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. చిత్ర బృందానికి సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story