Siddipet: ప్రభాకర్ రెడ్డి ఫైర్ అర్హులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే!
Siddipet: దుబ్బాక నియోజకవర్గంలో పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను కోరారు.
Siddipet: ప్రభాకర్ రెడ్డి ఫైర్ అర్హులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే
సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో పూర్తయిన 2BHK ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అందించాలి : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమస్యలను సమావేశంలో ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.గతంలో నిర్మించిన ఏడు మండలాలకు సంబంధించిన రెండు బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కొంతమంది లబ్ధిదారులు ఇప్పటికే రెండు నుండి రెండున్నర సంవత్సరాలుగా ఆ ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. తొగుట మండలం, దౌల్తాబాద్, దుబ్బాక మరియు అక్బర్‌పేట్ ప్రాంతాలలో దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు పూర్తయ్యాయని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి వెంటనే సర్టిఫికెట్లు అందజేయాలని అధికారులను కోరారు.
Next Story




