Dubbak: అధికారుల తీరుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Dubbak: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ 90 రోజుల ఉత్సవాలను బహిష్కరించారు
Dubbak: అధికారుల తీరుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక: 99 రోజుల విఫలోత్సవాలను బహిష్కరించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. రాష్ట్రంలో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం రోడ్లపై పడిగాపులు కాస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం “90 రోజుల ప్రజాపాలన సంబురాలు” పేరుతో ఉత్సవాలు జరుపుకోవడం దారుణమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జదుబ్బాకలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన రైతుల సమస్యలపై గళమెత్తగా, అధికారులు మైక్ నిలిపివేయడంతో నిరసనగా సభను బహిష్కరించి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతు ధాన్యం కొనకుండా గోదాముల వద్ద తిరుగుతుంటే, ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమి సాధించారో చెప్పాలి” అని ప్రశ్నించారు.తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్ నిర్మించి నీళ్లు అందించారన్నారు.




