Siddipet: తహసిల్దార్ ఆఫీస్ కూతవేటు దూరంలో అక్రమ మట్టి రవాణా

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలో అక్రమ మట్టి దందా బట్టబయలైంది.

Chindam Karunakar, Dubbak
Published on: 2 Jun 2026 7:27 PM IST
Siddipet
X

Siddipet: తహసిల్దార్ ఆఫీస్ కూతవేటు దూరంలో అక్రమ మట్టి రవాణా

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో అక్రమ మట్టి దందా బట్టబయలైంది. ధర్మారం గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, హిటాచి వాహనం ఏర్పాటు చేసి మట్టిని యదేచ్ఛగా తవ్వేస్తున్నారు. అక్కడి నుండి టిప్పర్లలో నింపి, మిరుదొడ్డిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆపకుండా తరలిస్తున్నారు. అసలు విడ్డూరం ఏంటంటే, ఈ అక్రమ మట్టి రవాణా జరుగుతున్న ఫంక్షన్ హాల్ తహసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంది. అయినా రెవెన్యూ అధికారులు ఏమీ తెలియనట్టు, కళ్లు మూసుకుని కూర్చున్నారు.

స్థానికులు పదే పదే ఫిర్యాదు చెయ్యడంతో, చివరికి రెవెన్యూ యంత్రాంగం కదిలింది. సంఘటనా స్థలానికి చేరుకుని హిటాచి వాహనాన్ని వదిలేసి, టిప్పర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే వాహనాన్ని పట్టుకున్న గంట వ్యవధిలోనే మళ్ళీ టిప్పర్లలో మట్టి తరలింపు జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఫంక్షన్ హాల్ స్థానిక బీఆర్ఎస్ నాయకులది కాబట్టే అధికారులు చూసీ చూడనట్టు వదిలేశారని, మామూళ్ల మత్తులో అక్రమ మట్టి దందాకు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story