Siddipet: చెరువులో దూకిన మహిళ.. ప్రాణం పోసిన బ్లూ కోల్ట్ పోలీసులు
Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు రక్షించారు.
Siddipet: చెరువులో దూకిన మహిళ.. ప్రాణం పోసిన బ్లూ కోల్ట్ పోలీసులు
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులతో గొడవ పడి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆవేశంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్దకు చేరుకుని, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నీటిలోకి దూకేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బ్లూ కోర్టు పోలీసులు రాజు, బాబు మెరుపు వేగంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. చెరువులో మునిగిపోతున్న మహిళను చూసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానికుల సహాయంతో నీటిలోకి దిగి ఆమెను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
ప్రాణం పోసిన సీపీఆర్ (CPR):
మహిళ ఒడ్డుకు వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉంది, శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఆ క్లిష్ట సమయంలో పోలీసులు తమ ప్రాథమిక చికిత్స నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు సీపీఆర్ (CPR) నిర్వహించారు. పోలీసుల కృషితో ఆమె ఊపిరి పీల్చుకోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.




