Thoguta: మంత్రి వివేక్‌ను కలిసి సమస్యలను ఏకరువు పెట్టిన విజయ్ అమర్ రెడ్డి
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట మండల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ అమర్ రెడ్డి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి చర్చించారు.
Thoguta: మంత్రి వివేక్‌ను కలిసి సమస్యలను ఏకరువు పెట్టిన విజయ్ అమర్ రెడ్డి
Thoguta: కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారితో ప్రత్యేకంగా సమావేశమైన మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్) రెడ్డి.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయ రంగ అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
మండల అభివృద్ధికి అవసరమైన నిధులు, కొత్త అభివృద్ధి పనుల మంజూరు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు విజయ్ అమర్ రెడ్డి తెలిపారు.
తొగుట మండల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరగా, మంత్రి గారు సానుకూలంగా స్పందించి అభివృద్ధి పనులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తొగుట మండలాన్ని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి కృషి తో అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.




