Siddipet: ఎల్లమ్మ చెరువు పనులు స్పీడప్.. నాణ్యత ఉంటేనే బిల్లులు అన్న మంత్రి!

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని చెరువుల సుందరీకరణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 April 2026 1:57 PM IST
Siddipet
X

Siddipet: ఎల్లమ్మ చెరువు పనులు స్పీడప్.. నాణ్యత ఉంటేనే బిల్లులు అన్న మంత్రి!

సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలో కొత్త చెరువు , ఎల్లమ్మ చెరువు,పల్లె చెరువు అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.

పల్లె చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు..

హుస్నాబాద్ పట్టణ డ్రైన్ వాటర్ కొత్త చెరువు లో కలవకుండా నేరుగా ప్రత్యేక ఫీడర్ కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు..

కొత్త చెరువు అభివృద్ధి పై పలు సూచనలు చేశారు..

అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు పరిశీలించారు..

కట్ట సుందరీకరణ డెవలప్మెంట్ జరుగుతున్న పనులపై ఆరా తీశారు..

పనుల్లో నాణ్యత ఉండాలని తెలిపారు..

చెరువులో నిర్మితమవుతున్న గ్లాస్ బ్రిడ్జి పనులు పరిశీలించారు..

కట్టపై గ్రీనరీ లాన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు.

కట్టపైన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు..

కట్టపైన ఉన్న గుట్టపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు..

హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో భక్తుల సదుపాయాల కోసం నిర్మిస్తున్న నూతన షెడ్డులను పరిశీలించారు..

ఆలయ పరిసరాల్లో నూతనంగా నిర్మితమవుతున్న పోచమ్మ ఆలయాన్ని పరిశీలించారు..

హుస్నాబాద్ 8,9 వ వార్డు కి సంబంధించి శ్మశాన వాటిక కు స్థల పరిశీలన చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు..

పల్లె చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు.. బతుకమ్మ మెట్ల ను పరిశీలించారు..

కట్ట బండ్ కి చుట్టూ రెయిలింగ్ నిర్మాణం పై పలు సూచనలు చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ,మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్డీవో ,మున్సిపల్ కమిషనర్ ,ఇతర ముఖ్య నేతలు, అధికారులు ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story