Gajwel: దళితులపై బీఆర్ఎస్ వివక్ష వీడాలి మల్కగళ్ల కరుణాకర్!

Gajwel: దళితులను అవమానించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి. గజ్వేల్ కాంగ్రెస్ ప్రెస్ మీట్‌లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్కగళ్ల కరుణాకర్ డిమాండ్.

MEER OSMAN ALI KHAN, GAJEWL
Published on: 12 Sept 2026 5:30 PM IST
Gajwel
X

Gajwel: దళితులపై బీఆర్ఎస్ వివక్ష వీడాలి మల్కగళ్ల కరుణాకర్!

Gajwel: బిఆర్ఎస్ నాయకులు దళితుల పట్ల తమ వివక్ష పూరిత వైఖరిని తక్షణమే వీడాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్కగళ్ల కరుణాకర్ డిమాండ్ చేశారు. ఇటీవల కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ను దళితులు డప్పులతో ముట్టడించిన అనంతరం, వారు నడిచిన దారిలో బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లు, పాలు చల్లి శుద్ధి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది దళిత సమాజాన్ని ఘోరంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు దళితుల ఓట్లు మాత్రమే కావాలని, దళితులపై గౌరవం లేదని విమర్శించారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మల్కగళ్ల కరుణాకర్ మాట్లాడుతూ. తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని విమర్శించారు.

న్యాయమైన డిమాండ్ల కోసం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వచ్చిన దళితులు నడిచిన బాటను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం బీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.దళితులను అవమానించిన సదరు బీఆర్ఎస్ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కరుణాకర్ డిమాండ్ చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ మూడుసార్లు గెలిచినా స్థానిక ప్రజల సమస్యలను ఎన్నడూ పట్టించుకోలేదని, కేవలం ఓట్ల కోసమే గజ్వేల్‌కు వచ్చి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా కేసీఆర్ ఫామ్‌హౌస్ వీడి ప్రజాక్షేత్రంలోకి రావాలని, దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవాలని స్పష్టం చేశారు.

MEER OSMAN ALI KHAN, GAJEWL

MEER OSMAN ALI KHAN, GAJEWL