Siddipet: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మళ్లీ మచ్చ శ్రీనివాస్

Siddipet: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మచ్చ శ్రీనివాస్ పునర్నియామకం. మంత్రి వివేక్, ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు.

Chindam Karunakar, Dubbak
Published on: 3 July 2026 9:42 AM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మళ్లీ మచ్చ శ్రీనివాస్

సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధికార ప్రతినిధిగా మచ్చ శ్రీనివాస్ మరోసారి నియమితులయ్యారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లా అధికార ప్రతినిధిగా సేవలు అందించిన ఆయనకు, పార్టీ నాయకత్వం మరోసారి ఈ బాధ్యతలను అప్పగించింది.

ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో మరోసారి జిల్లా అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికి, డీసీసీ అధ్యక్షులు కి, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, జిల్లా కాంగ్రెస్ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అంకితభావంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story