Dubbaka: దుబ్బాకలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం తనిఖీ

Dubbaka: దుబ్బాక గ్రంథాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా చైర్మన్ దరిపల్లి చంద్రం. పాత ఎమ్మార్వో ఆఫీసులో నూతన డిజిటల్ భవన నిర్మాణానికి ప్రతిపాదన.

Chindam Karunakar, Dubbak
Published on: 30 Jun 2026 8:30 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాకలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం తనిఖీ

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో జిల్లా గ్రంధాలయ శాఖ చైర్మన్ శ్రీ దరిపల్లి చంద్రం గారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది గ్రంథాలయం లో వసతులు మామూలుగానే ఉన్నాయని వారు తెలియజేశారు.

గాంధీ విగ్రహం దగ్గర పాత గ్రంథాలయ స్థలం పరిశీలించారు మరియు పాత ఎమ్మార్వో ఆఫీసులో జిల్లా కలెక్టర్ గారు 8 గుంటల స్థలాన్ని కేటాయించారు.

నూతన డిజిటల్ గ్రంథాలయ భవనాన్ని పాత ఎంఆర్ఓ ఆఫీస్ లోనే నిర్మాణం చేపట్టాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ లైబ్రేరియన్ దాసరి రాజు కీసరి స్వామి జూనియర్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story