Komuravelli: కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం 63 రోజుల్లో రూ.74.52 లక్షలు

Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీల లెక్కింపు పూర్తి. 63 రోజుల్లో రూ.74,52,087 నగదు, 32 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి ఆదాయం సమకూరినట్లు ఈవో వెల్లడి.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 16 Sept 2026 5:22 PM IST
Komuravelli
X

Komuravelli: కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం 63 రోజుల్లో రూ.74.52 లక్షలు

కొమురవెల్లి: కొమురవెల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయ హుండీలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు లెక్కించారు.

63 (దాదాపు రెండునెలల) రోజుల స్వామి వారి ఆదాయం ఈ విధంగా సమకూరింది. నగదు.74,52,087/-రూపాయలు, మిశ్రమ బంగారం 32గ్రా, మిశ్రమ వెండి 3 కిలోలు 200 గ్రాములు, విదేశీ కరెన్సీ- 31 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

హుండీ లెక్కింపు లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సీసీ కెమెరాల మరియు ఆలయ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు జరిగినట్టు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ హుండీ లెక్కింపు లో శివ రామ కృష్ణ భజన మండలి సమితి సేవ సభ్యులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్ రెడ్డి. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పీ.విజయలక్ష్మి, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు ఎన్ చంద్రశేఖర్ ,మరియు సిబ్బంది , అర్చకులు , పోలీస్ సిబ్బంది , ఎస్ బి ఐ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL