Siddipet: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని 250 కి.మీ. పాదయాత్ర!
Siddipet: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలం నుంచి బయలుదేరిన తిరుపతి, శంకర్ పాదయాత్ర 250 కి.మీ. పూర్తి చేసుకుని సిద్దిపేట చేరుకుంది.
Siddipet: కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని 250 కి.మీ. పాదయాత్ర!
సిద్దిపేట: ఆసిఫాబాద్ నియోజకవర్గం వాన్ కాడి మండల్ నుంచి టిఆర్ఎస్ అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఆధ్వర్యంలో తిరుపతి ,శంకర్ కెసిఆర్ గారి అభిమానం తో పాదయాత్ర బయలుదేరి సుమారు 250 కిలోమీటర్లు పూర్తిచేసుకుని సిద్దిపేట రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ,కెసిఆర్ ప్రభుత్వం తిరిగి ఏర్పడాలని, ప్రజలు కోరుకుంటున్నారని పాదయాత్రలో ఎక్కడికి వెళ్లిన మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందని అన్నారు.
సిద్దిపేట అభివృద్ధి హరీష్ అన్న ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడవెరుగు రాజనర్సు , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయకం వెంకటేష్, ముత్యాల కనకయ్య గారు, శ్రీహరి, నూరి బాయ్, ఆంజనేయులు, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




