Dubbaka: కార్మికుల ఆరోగ్యంపై కత్తి కార్తిక ప్రత్యేక శ్రద్ధ

Dubbaka: దుబ్బాక మండలం శివాజీ నగర్ తాండాలో మహిళా బీడీ కార్మికులను కలిసిన బిఆర్ఎస్ నేత కత్తి కార్తిక.

Chindam Karunakar, Dubbak
Published on: 24 April 2026 5:23 PM IST
Dubbaka
X

Dubbaka: కార్మికుల ఆరోగ్యంపై కత్తి కార్తిక ప్రత్యేక శ్రద్ధ

Dubbaka: టీమ్ కార్తీక పౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శివాజీ నగర్ తాండ గ్రామంలో బీడీ ఖర్కానా కి విచ్చేసి మహిళా బీడీ కార్మికులను కలిసి, వారి సమస్యలు తెలుసుకుని, వారి ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించి, వారికి సంజీవని శక్తి కిట్లు అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ గారు.

అక్క గారు ఈ కిట్ కోసం వివరిస్తూ ఈ సంజీవని కిట్, మీ ఊపిరిలో బలాన్ని, మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది అని మీకు తోడుగా మీ బిడ్డగా నేను మీతో ఉన్నాను అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్, సర్పంచ్ బానోతు సునీత సంతోష్, ఉప సర్పంచ్ భవిష బాబు, మహేందర్ గౌడ్, పరశురామ్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story