Bejjanki: పడకేసిన రహదారుల అభివృద్ధి.. ప్రజల అవస్థలు: దోనే అశోక్
Bejjanki: బెజ్జంకి మండలంలో రూ.22 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు ఏళ్ల తరబడి సాగుతున్నాయని, భక్తులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చాలని జనసేన నేత అశోక్ డిమాండ్ చేశారు.
Bejjanki: పడకేసిన రహదారుల అభివృద్ధి.. ప్రజల అవస్థలు: దోనే అశోక్
Bejjanki: బెజ్జంకి మండలంలోని రహదారులు ప్రమాదకరంగా మారినా ప్రభుత్వం మరియు నాయకులు పట్టించుకోవడం లేదని జనసేన నాయకులు దోనే అశోక్ విమర్శించారు. శనిగరం X రోడ్ నుంచి గన్నేరువరం వరకు సుమారు రూ.22 కోట్లతో చేపట్టిన రెండు వరుసల రహదారి అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నా పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డుపై దుమ్ము, గుంతల కారణంగా ప్రమాదాల ముప్పు పెరిగిందని తెలిపారు.
ఈ రహదారి మానసదేవి దేవాలయానికి వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ప్రతిరోజూ భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దోనే అశోక్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి, రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వాల తప్పిదాలను సాకుగా చూపకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి రహదారి అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు దోనే అశోక్ కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్యాల శేషుకుమార్, గంగాధర తిరుపతి, గొడుగు సంపత్, సంతోష్ తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




