Husnabad: జీవో 97ను ఉపసంహరించుకోవాలి హుస్నాబాద్‌లో విద్యార్థుల నిరసన

Husnabad: సాంకేతిక విద్యను 'శక్తి' శాఖలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ హుస్నాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 19 Aug 2026 7:27 PM IST
Husnabad
X

Husnabad: జీవో 97ను ఉపసంహరించుకోవాలి హుస్నాబాద్‌లో విద్యార్థుల నిరసన

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ ను 'శక్తి' శాఖలో విలీనం చేయవద్దంటూ మానవహారంగా ఏర్పడి ఆందోళన వ్యక్తం చేశారు.

శక్తి శాఖ ఏర్పాటుచేసి అందులో ఐటిఐ, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లను విలీనం చేయడంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని విద్యార్థులు అన్నారు.

శక్తి స్కీమ్ కు బదులు పాలిటెక్నిక్ అనంతరం బీటెక్ లో ప్రవేశానికి సీట్ల సంఖ్యను పెంచాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి విలీన ప్రక్రియను ఉపసంహరించుకొని జీవో నెంబర్ 97 ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ను పెంచి బకాయిలను విడుదల చేయాలని కోరారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story