Husnabad: ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్!
Husnabad: హుస్నాబాద్ ఉమ్మాపూర్‌లో ₹7.28 కోట్లతో శాతవాహన వర్సిటీ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
Husnabad: ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్!
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ లో 7 కోట్ల 28 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
వచ్చే సంవత్సరం ఆగస్టు లోపు ఇంజనీరింగ్ కళాశాల పూర్తి చేసి జాతీయ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ స్కూలు హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పూర్తవుతుందన్నారు. శాతవాహన యూనివర్సిటీ కళాశాలకు త్వరలో మరో రెండు బస్సులు తీసుకొస్తామని తెలిపారు.
విద్యా ప్రమాణాలు బాగుంటేనే విద్యాసంస్థలు అభివృద్ధి చెందుతాయని, త్వరలో హుస్నాబాద్ కు కబడ్డీ అకాడమీ తీసుకువచ్చి మంచి స్పోర్ట్స్ స్టేడియం నిర్మిస్తామన్నారు. సౌకర్యాలు మావి ర్యాంకులు తెచ్చే బాధ్యత విద్యార్థులదని, విద్యార్థులు ఇక్కడి నుండి జాబ్ తోనే బయటకు వెళ్ళాలన్నారు. సైదాపూర్ లో మరో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రాబోతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజీకి అప్రోచ్ రోడ్డు వేస్తున్నామని, ఆటోమేటిక్ గా స్ట్రీట్ లైట్స్ వస్తాయన్నారు.




