Husnabad: సైకిల్‌పై శానిటేషన్ పనుల పర్యవేక్షణ: కమిషనర్ మల్లికార్జున్
Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్ సైకిల్‌పై పర్యటిస్తూ శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Husnabad: సైకిల్‌పై శానిటేషన్ పనుల పర్యవేక్షణ: కమిషనర్ మల్లికార్జున్
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలో సైకిల్‌పై పర్యటిస్తూ శానిటేషన్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
పట్టణంలోని వీధుల పరిశుభ్రత, పారిశుధ్య సిబ్బంది పనితీరు, ఇంటింటి చెత్త సేకరణ తదితర అంశాలను స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా ఆయన చేపట్టిన ఈ సైకిల్ ప్రయాణం ప్రజలకు మంచి సందేశాన్ని అందించింది.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీమతి దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి పద్మ, కౌన్సిలర్లు లత, వరప్రసాద్, రమేష్, శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు రమణ, రవీందర్, కొమురయ్య, క్రిస్టస్వామి కమిషనర్‌ను అభినందించారు.
శానిటేషన్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న కమిషనర్ కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. సిద్దిపేట ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ గా కూడా విధులు నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలోని వీధుల్లో ప్రతిరోజు సైకిల్ పై తిరుగుతూ పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుండడం విశేషం.




