Siddipet: బెజ్జంకి తహసీల్దార్ ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం!
Siddipet: సిద్దిపేట జిల్లా బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయంలో భూవివాదంపై మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Siddipet: బెజ్జంకి తహసీల్దార్ ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం!
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఆవరణలో అందె మల్లెత్తుల లక్ష్మీ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హంగామా చేసింది. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన అందె మల్లగారి లక్మీ తండ్రికి బెజ్జంకి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 565ఏ/డి లోని 38 గుంటల భూమి ఉన్నది.
ఇట్టి భూమి తగాదా కోర్టు పరిధిలో ఉందని, ఇతురలకు రిజిష్ట్రేషన్ చేయవద్దని, పట్టా మార్పిడి చేయవద్దని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు తాసీల్దార్ కార్యాలయంకు చేరుకుని ఇతరులకు రిజిష్ట్రేషన్ చేయవద్దని ఆఫీసులో తెలిపారు.
ఇతరులకు రిజిష్ర్టేషన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధిత కుటుంబం తెలిపింది. అందుకే ఆత్మహత్యా చేసుకోవడానికి సిద్దమైనట్లు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో అత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడున్న పోలీసులు మహిళ ఆత్మహత్య చేసుకుండా అడ్డుకున్నారు.




