Siddipet: మట్టి విగ్రహం పెడితే పర్మినెంట్ షెడ్డు ఇస్తా: హరీశ్ రావు

Siddipet: సిద్దిపేటలో మట్టి వినాయకులను పంపిణీ చేసిన హరీశ్ రావు.. ఊరికొక మట్టి విగ్రహం పెడితే శాశ్వత షెడ్డు నిర్మిస్తామని, ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు.

RAJU, SIDDIPET
Published on: 13 Sept 2026 3:05 PM IST
Siddipet
X

Siddipet: మట్టి విగ్రహం పెడితే పర్మినెంట్ షెడ్డు ఇస్తా: హరీశ్ రావు

Siddipet: విగ్నేశ్వరుడు దేవుడే కాకుండా ప్రజలందరికీ మార్గదర్శకుడని మాజీమంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

వినాయక విగ్రహాన్ని ఎంత పెద్దగా పెట్టామన్నది ముఖ్యం కాదని ఎంత భక్తిశ్రద్ధలతో పూజించామన్నదే ముఖ్యమన్నారు. ఊరికి ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటుచేసి పూజించాలని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. ఏ గ్రామంలోనైనా, వార్డులోనైనా ఒక్కటే ఒక మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే తాను పర్మినెంట్ షెడ్డు నిర్మించి ఇస్తానని పిలుపునిచ్చారు.

రసాయనలతో కూడిన వినాయకులను చెరువులో నిమజ్జనం చేయడంతో నీళ్లలో ఉండే జీవరాశులు చనిపోవడంతో పాటు భూమి కలుషితమై ప్రజా ఆరోగ్యానికి కీడు చేసే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు... వినాయకుడి రూపంలోనే మనకు ఎన్నో సందేశాలు ఉన్నాయి.ఆయన పెద్ద తల గొప్పగా ఆలోచించమని చెబుతుంది... పెద్ద చెవులు ప్రజల మాట వినాలని చెబుతాయి... చిన్న కళ్ళు లక్ష్యంపై దృష్టి పెట్టాలని చెబుతాయి.

ఆయన తొండం పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని నేర్పుతుంది. అందుకే గణపతి కేవలం పూజించే దేవుడు మాత్రమే కాదు… మన జీవితానికి మార్గదర్శకుడన్నారు. ప్రకృతిని ప్రేమించి, పుష్పాలను ప్రేమించే గొప్ప సముష్కృతి మన తెలంగాణ వారిదన్నారు. దక్షిణ భారతదేశంలోనే అమర్నాథ్ అన్నా సేవ సమితి ప్రసిద్ధిగాంచిందన్నారు.

అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో 16 సంవత్సరాలుగా మంచు కొండల్లో సేవలందించడం గొప్ప విషయమన్నారు. అలాగే ప్రకృతిని ప్రేమిస్తూ 16 సంవత్సరాలుగా సిద్దిపేటలో ప్రతి సంవత్సరం పదివేల మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మనం ఏ కార్యక్రమం చేపట్టిన ముందు విఘ్నేశ్వరుని పూజించే చేపడుతామని ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET