Gajwel: కనీస వేతన మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం ఇవ్వాలి: ఎల్లయ్య
Gajwel: కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు స్థానం కల్పించాలని గజ్వేల్‌లో నిరసన. కార్మిక హక్కులను కేంద్రం తొక్కిపెడుతోందని ఎల్లయ్య ఆగ్రహం.
Gajwel: కనీస వేతన మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం ఇవ్వాలి: ఎల్లయ్య
Gajwel: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల సలహా మండలిలో సిఐటియుకు ప్రాతినిధ్యం కల్పించాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యం కూని చేస్తున్నదని కార్మిక వర్గం తరఫున పోరాడుతున్న సిఐటియుకు కేంద్ర కనీస వేతనాలు సలహా మండల్లో స్థానం కల్పించలేదని అన్నారు.
ఇటీవల ప్రకటించిన కేంద్ర కనీస వేతన సలహా మండలి గోప్యంగా ఉంచిందని సలహా మండలిలో ప్రభుత్వ అధికారులు, యజమాన్యం ప్రతినిధులు కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారని కానీ కేంద్రం ప్రకటించిన కనీస వేతనం సలహా మండల్లో కార్మిక సంఘాల తరఫున సిఐటియు ఏఐటియూసి ఐఎన్టియుసి కార్మిక సంఘాలకు స్థానం కల్పించలేదని ప్రభుత్వానికి వత్తాసు పడే సంఘాలకు భాగస్వామ్యం చేసిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను కార్మిక వర్గం గమనించాలని, కార్మిక కోడలు అమలు చేసే కుట్రలో భాగంగా కార్మిక వర్గం పై భారాలను సిఐటియు అడ్డుకుంటుందని, ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికుల్లో ప్రచారం చేసిందని ఇటువంటి చర్యలకు పూనుకున్నదాని అన్నారు.
కార్మిక వర్గం పోరాటాల సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రారెడ్డి, జిల్లా నాయకులు సధాకర్ కనరాజు పరశురాములు భూపతి రాజు యాదగిరి ప్రవీణ్ బండ్ల శ్రీను రవి శ్రావణ్ రాజేందర్ రెడ్డి, మురళి, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




