Siddipet: బంగారం మెరిపిస్తామని మోసం.. 8 గ్రాముల బంగారం కాజేసిన కేటుగాళ్లు!

Siddipet: సిద్దిపేట జిల్లా వెంకట్రావుపేటలో బంగారం మెరిపిస్తామంటూ మహిళను నమ్మించి 8 గ్రాముల బంగారాన్ని కాజేసిన కేటుగాళ్లు.

Chindam Karunakar, Dubbak
Published on: 14 Jun 2026 11:20 AM IST
Siddipet
X

Siddipet: బంగారం మెరిపిస్తామని మోసం.. 8 గ్రాముల బంగారం కాజేసిన కేటుగాళ్లు!

Siddipet: బంగారు ఆభరణాలను కొత్తవాటిలా మెరిపిస్తామని నమ్మబలికి మహిళలను మోసం చేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ఇద్దరు యువకులు ఈ తరహా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

గ్రామంలోని పలువురు ఇళ్లకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న ప్రత్యేక పౌడర్, లిక్విడ్‌తో బంగారం, వెండి ఆభరణాలను తెల్లగా చేసి మెరిపిస్తామని చెప్పారు. అయితే చాలా మంది వారి మాటలను నమ్మలేదు. చివరకు గ్రామానికి చెందిన కళ్లెపు అనూష ఇంటికి వెళ్లిన వారు ముందుగా ఆమె చేతులపై పౌడర్ వేసి నమ్మకం కల్పించారు.

ఆ తర్వాత అనూష మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు, ఆమెతో పాటు ఆమె చెల్లి కాళ్లలో ఉన్న వెండి పట్ట గొలుసులను తీసుకుని శుభ్రం చేస్తామని చెప్పారు. ఏదో రసాయన ద్రావణంలో వాటిని ముంచి కొంతసేపటి తర్వాత తిరిగి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అయితే ఆభరణాల బరువు తక్కువగా ఉన్నట్లు గమనించిన బాధితులు స్థానిక బంగారు దుకాణంలో తూకం వేయించగా సుమారు 8 గ్రాముల బంగార కరిగించికాజేసినట్లుగుర్తించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story