Husnabad: హుస్నాబాద్‌లో కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట!

Husnabad: హుస్నాబాద్‌లో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ 420 అడుగుల ఫ్లెక్సీతో మహాధర్నా చేపట్టింది.

CH SRINIVAS, HUSNABAD
Published on: 2 Sept 2026 6:34 PM IST
Husnabad
X

Husnabad: హుస్నాబాద్‌లో కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట!

హుస్నాబాద్: వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టడంతో పాటు 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టారు గులాబీ శ్రేణులు. కాంగ్రెస్ హామీల బాకీ కార్డుతో బి.ఆర్.ఎస్ నేతలు సెల్ఫీలు దిగి నిరసన చేపట్టారు.

ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పోరాటం కొనసాగుతుందన్నారు.

ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, అప్పటి వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉంటుందని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story