Dubbaka: దుబ్బాక హబ్సీపూర్ వద్ద హోరెత్తిన బీఆర్‌ఎస్ 'పోలికేక' ధర్నా!

Dubbaka: దుబ్బాక హబ్సీపూర్ వద్ద బీఆర్‌ఎస్ 'పోలికేక' ధర్నా.. సీఎం రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం.

KARUNAKAR,	DUBBAK
Published on: 5 Sept 2026 3:37 PM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక హబ్సీపూర్ వద్ద హోరెత్తిన బీఆర్‌ఎస్ 'పోలికేక' ధర్నా!

Dubbaka: దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోలికేక మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కెసిఆర్ పాలన ఉన్నప్పుడు కరెంట్ సమస్య లేదని,రెవంత్ రెడ్డిని గెలిపిస్తే పాత రోజులు వస్తాయని అన్నారని మళ్లీ పాత రోజులే వచ్చాయన్నారు.కెసిఆర్ పాలనలో కరోన సమయంలో కుడా రైతుబంధు వేసిండని,కెసిఆర్ చెప్పకుండానే రైతుబంధు ఇచ్చిండన్నారు.

రెవంత్ రెడ్డి 29,000 వేల రైతుబంధు ఎగ పెట్టిండని,కెసిఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత ఉండేది కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు యూరియా కొరత ఏర్పడుతుందని మండి పడ్డారు.యూరియా యాప్ పెట్టి రైతులకు ఇబ్బంది పాలు చేస్తున్నారని,900 ఉన్న డిఏపి బిజెపి పాలనలో 2200 అయిందన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story