Dubbaka: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు హమారా ప్రసాద్‌పై దుబ్బాకలో ఫిర్యాదు!

Dubbaka: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో దుబ్బాక పిఎస్ లో ఫిర్యాదు.

KARUNAKAR,	DUBBAK
Published on: 5 Sept 2026 9:10 AM IST
Dubbaka
X

Dubbaka: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు హమారా ప్రసాద్‌పై దుబ్బాకలో ఫిర్యాదు!

Dubbaka: తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పిల్లి సుధాకర్ రాష్ట్ర పొలిటి బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ ఎలుక దేవయ్య గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ గారి పై సోషల్ మీడియాలో టీవీ ఇంటర్వ్యూలలో అంబేద్కర్ గారిని అవమాన పరుస్తూ రాజ్యాంగాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతున్న హమారా ప్రసాద్ అలియాస్ నాగుల పురం వరప్రసాద్ పై సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు SHO గారికి ఫిర్యాదు చేయడమైనది.

వానిపై వెంటనే దేశ ద్రోహిగా రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచినందుకు కఠినంగా శిక్షించాలని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు తరపున కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దుబ్బాక మాల మహానాడు నాయకులు ఆస ముత్యం బావాజీ రమేష్ ఐత స్వామి లచ్చపేట నర్సింలు బావాజీ పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story