Dubbaka: దుబ్బాక పద్మశాలి సంఘం నూతన కమిటీకి లచ్చపేటలో ఘన సన్మానం!
Dubbaka: దుబ్బాక పద్మశాలి సంఘం నూతన పాలకవర్గానికి లచ్చపేట పద్మశాలి కుల బాంధవులు ఘన సన్మానం చేశారు.
Dubbaka: దుబ్బాక పద్మశాలి సంఘం నూతన కమిటీకి లచ్చపేటలో ఘన సన్మానం!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట వార్డులోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన దుబ్బాక పద్మశాలి సంఘానికి ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యులను లచ్చపేట పద్మశాలి కుల బాంధవులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అంకం మధు, ఉపాధ్యక్షులుగా గాజుల భాస్కర్, కార్యదర్శిగా బోడ చంద్రమోహన్, కోశాధికారిగా కారంపూరి గురుచరణ్ అలాగే డైరెక్టర్లుగా ఎన్నికైన చెలిమెల్ల రాజేశం, సిరిగాద నర్సింలు, మెతుకు కవిత తదితరులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు,
మార్కండేయ స్వామి ఫోటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. లచ్చపేట పద్మశాలి సంఘం అధ్యక్షులు, 10వ వార్డు కౌన్సిలర్ శ్రీ బడుగు రాజు గారు మాట్లాడుతూ నూతన పాలకవర్గం సమాజ అభివృద్ధి, ఐక్యత,పద్మశాలి సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అదేవిధంగా
ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ శ్రీ నందాల శ్రీకాంత్ పాల్గొని నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.




