Dubbaka: దుబ్బాక గ్రామీణాభివృద్ధిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్

Dubbaka: దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షల నిధులు మంజూరు.

Chindam Karunakar, Dubbak
Published on: 26 Jun 2026 10:14 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక గ్రామీణాభివృద్ధిపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్

Dubbaka: దుబ్బాక నియోజకవర్గ ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది.సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్‌పేట భూంపల్లి, దౌల్తాబాద్, తొగుట, దుబ్బాక, మిరుదొడ్డి మండలాల పరిధిలోని పలు గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు కావడం ప్రజలకు ఎంతో శుభపరిణామం.

ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అలాగే దుబ్బాక అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఈ అభివృద్ధి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయి.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story