Daultabad: మహిళల ఆర్థిక సాధికారితకే మా ప్రాధాన్యత ఇంచార్జ్ శ్రీనివాస్!

Daultabad: పలు గ్రామాల్లో మహిళా సమైక్య భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ భూమి పూజ చేసి ప్రారంభించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 8 July 2026 8:29 PM IST
Daultabad
X

Daultabad: మహిళల ఆర్థిక సాధికారితకే మా ప్రాధాన్యత ఇంచార్జ్ శ్రీనివాస్!

దౌల్తాబాద్: మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఆహమ్మద్ నగర్, గాజులపల్లి, దొమ్మాట, పోసానిపల్లి, ఉప్పరపల్లి, దౌల్తాబాద్, లో పర్యటించి మహిళ సమైక్య భవనాలకు అలాగే సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళ ఆర్థిక సామాజిక, సాధికారితకు మహిళా సమాఖ్య, భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. మహిళా సంఘాల సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు మరియు స్వయం ఉపాధి కార్యక్రమాలకు ఈ భవనాలు ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, రాయపోల్ మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్ వైస్ చైర్మన్ మద్దెల స్వామి తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story