Dubbaka: ఎమ్మెల్సీ తాతా మధుపై అట్రాసిటీ కేసు పెట్టాలి - కాంగ్రెస్

Dubbaka: దుబ్బాకలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు.

Chindam Karunakar, Dubbak
Published on: 7 Sept 2026 5:27 PM IST
Dubbaka
X

Dubbaka: ఎమ్మెల్సీ తాతా మధుపై అట్రాసిటీ కేసు పెట్టాలి - కాంగ్రెస్

దుబ్బాక: అసెంబ్లీ సాక్షిగా ఈరోజు తెలంగాణ శాసనమండలి సభ్యుడు MLC తాతా మధుసూదన్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ దుర్భాష రాయడం యావత్ తెలంగాణ దళిత సామాజిక వర్గాన్ని అవమానించడంగా భావిస్తున్నాం కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడించిన మాటలుగా భావిస్తూ ఉన్నాం ఒక సభాపతిని దళితున్ని గౌరవించని BRS పార్టీ నాయకులు ప్రజలకు ఇలాంటి న్యాయం చేస్తారు.

దేవాలయం లాంటి అసెంబ్లీలోకి నల్ల దుస్తులు ధరించి సభను పక్క తోవ పట్టించాలని చూస్తున్నారు దళితున్ని అవమానిస్తే అసెంబ్లీ సజావుగా సాగకుండా ఉంటుందని హరీష్ రావు కేటీఆర్ గారి పన్నాగంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది యావత్ తెలంగాణ ప్రజలు మీరు చేసే చిల్లర చేష్టలు చూస్తా ఉన్నారు.

సభాపతి గడ్డం ప్రసాద్ గారిని అవమానపరిచిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అలాగే శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story