Dubbaka: దుబ్బాకలో కాంగ్రెస్ ఆరోపణలపై బీఆర్ఎస్ నేతల నిరసన!
Dubbaka: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల అసత్య ఆరోపణలపై బీఆర్ఎస్ ఆగ్రహం. ఇల్లందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.
Dubbaka: దుబ్బాకలో కాంగ్రెస్ ఆరోపణలపై బీఆర్ఎస్ నేతల నిరసన!
Dubbaka: కాంగ్రెస్ నాయకుల అసత్య ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఇల్లందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిపోటు జరిగి ప్రాణాపాయం నుంచి బయటపడితే, కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజల విశ్వాసం లేని కాంగ్రెస్ నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని, గెలుపు చేతకాక ఎమ్మెల్యేపై విమర్శలు చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆయన కార్యకర్తలు అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు.




