Dubbaka: జూన్ 27 లోగా పింఛన్‌దారులు ముఖ గుర్తింపు పూర్తి చేయాలి!
Dubbaka: దుబ్బాకలో ఆసరా పింఛన్‌దారులు జూన్ 27 లోగా ముఖ గుర్తింపు పూర్తి చేయాలని కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. లేదంటే పింఛన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
Dubbaka: జూన్ 27 లోగా పింఛన్‌దారులు ముఖ గుర్తింపు పూర్తి చేయాలి!
దుబ్బాక: ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న ఆసరా పెన్షన్లను పొందుతున్న లబ్ధిదారులు ఈ నెల 27వ తేదీలోగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక కార్యాలయంలో ముఖ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని దుబ్బాక పురపాలిక కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు.
పురపాలిక కార్యాలయ సమావేశ మందిరంలో పింఛను దారుల ముఖ గుర్తింపు ప్రక్రియకు సంబంధించి మెప్మా ఆర్పీలు, వార్డు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మెప్మా ఆర్పీల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనితీరును మార్చుకోవాలని సూచించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పురపాలికలో 8386 పింఛనుదారులు ఉంటే,7459 మంది లబ్ధిదారులు ఇప్పటివరకు ముఖ గుర్తింపు చేసుకున్నారన్నారు. ముఖ గుర్తింపు (ఫేస్ లైవ్ అతేంటికేషన్) చేయించుకోకపోతే లబ్ధిదారులు ఆసరా పింఛన్లను కోల్పోతారని తెలిపారు.
పురపాలిక దుకాణ సముదాయాల్లో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులు పెండింగ్లో ఉన్న అద్దె బకాయిలను పురపాలిక కార్యాలయంలో తక్షణమే చెల్లించాలి.




