Siddipet: రైతులకు సబ్సిడీలు, లోన్లు.. దుబ్బాకలో అధికారుల బిగ్ అప్‌డేట్!
Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు నిర్వహించారు.
Siddipet: రైతులకు సబ్సిడీలు, లోన్లు.. దుబ్బాకలో అధికారుల బిగ్ అప్‌డేట్!
Siddipet: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ బ్యాంక్ అధికారులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. ఒకే రకమైన పంటను సాగు చేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్సిడీపై పరికరాలు అందించడంతోపాటు పంట రుణాలను అందిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మార్కెట్లో డిమాండ్ ఉండే సన్నరకం వరి ధాన్యాన్ని రైతులు సాగు చేసి అధిక లాభాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, రైతులు పలువురు పాల్గొన్నారు.




