Dubbaka: దుబ్బాక 14వ వార్డులో ‘ప్రజా పాలన’.. వర్షాకాల ముందస్తు జాగ్రత్తలపై అధికారుల అవగాహన!

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డులో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" సదస్సు ఘనంగా జరిగింది.

Chindam Karunakar, Dubbak
Published on: 11 Jun 2026 9:27 AM IST
Dubbaka
X

Dubbaka: దుబ్బాక 14వ వార్డులో ‘ప్రజా పాలన’.. వర్షాకాల ముందస్తు జాగ్రత్తలపై అధికారుల అవగాహన!

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ 14వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ వార్డు కౌన్సిలర్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ మరియు వార్డు ప్రజల సమక్షంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది వచ్చే వర్షాకాలంలో తీసుకునే జాగ్రత్తలు విష జ్వరాలనుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని విద్యుత్ ప్రమాదాల నుంచి మరియు విద్యార్థులకు అంగన్వాడి పిల్లలకు ఆరోగ్య సమస్యలపై తడిచేత పొడి చెత్త ఎలా ఉపయోగించాలని మహిళా మండలిల మహిళలకు మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇచ్చే రుణాలు అలాగే పెన్షన్ విధానం గురించి ఇందిరమ్మ ఇండ్ల అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని తెలపడం జరిగింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story