Doulthabad: పామాయిల్ తోటను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి!

Doulthabad: దౌల్తాబాద్‌లో పామాయిల్ తోటను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 27 Aug 2026 8:54 PM IST
Doulthabad
X

Doulthabad: పామాయిల్ తోటను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి!

దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీమొద్దీన్ సాగు చేస్తున్న పామాయిల్ తోటను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు.పామాయిల్ సాగు విధానం, మొక్కల పెరుగుదల, పంట సంరక్షణ, దిగుబడి, మార్కెటింగ్, రైతుకు లభిస్తున్న ఆదాయం తదితర అంశాలను రైతును అడిగి తెలుసుకున్నారు.

తోటలో పామాయిల్ మొక్కల పెరుగుదల, పంట పరిస్థితులను స్వయంగా పరిశీలించి, సాగులో రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరమైన సహకారం గురించి వివరాలు తెలుసుకున్నారు.ప్రస్తుతం రైతులకు సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా స్థిరమైన ఆదాయం అందేలా ప్రోత్సహించడం అవసరమని వారు పేర్కొన్నారు.

పామాయిల్ వంటి దీర్ఘకాలిక పంటల సాగుతో రైతులకు ఆదాయ అవకాశాలు పెరిగేలా, సాగు సమయంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా.. రైతులకు అండగా నిలుస్తామన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story