Dubbak: ప్రజా సేవలో సీపీఎం.. 60 రోజుల పాటు చలివేంద్రం నిర్వాహణ

Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 60 రోజుల పాటు నిర్వహించిన చలివేంద్రం విజయవంతంగా ముగిసింది.

Chindam Karunakar, Dubbak
Published on: 12 Jun 2026 9:52 AM IST
Dubbak
X

Dubbak: ప్రజా సేవలో సీపీఎం.. 60 రోజుల పాటు చలివేంద్రం నిర్వాహణ

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపల్ పట్టణంలో సీపీఎం పార్టీ దుబ్బాక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో ప్రారంభించిన చలివేంద్రం సేవా కార్యక్రమం 60 రోజుల పాటు విజయవంతంగాకొనసాగింది.ఈరోజుతో ముగిసింది.

ఈ సందర్భంగా సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్ మాట్లాడుతూ, తీవ్రమైన వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో సీపీఎం పార్టీ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గత 60 రోజులుగా ప్రజలకు నిరంతరంగా సేవలు అందించడం సంతోషకరమని తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాడటతూ, కార్మికులు,కర్షకుల సమస్యల పై మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరంతరంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ప్రజల అవసరాల సమయంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సీపీఎం పార్టీ బాధ్యతగా భావిస్తుందని అన్నారు.ఈ చలివేంద్రం నిర్వహణకు ప్రత్యక్షంగా,పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story