Siddipet: నిర్వాసితుల పోరాటానికి తగిన ఫలితం చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Siddipet: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు R&R ప్యాకేజీ అందజేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
Siddipet: నిర్వాసితుల పోరాటానికి తగిన ఫలితం చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Siddipet: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ , తొగుట గ్రామాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడటం హర్షణీయమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.తొగుట,తుక్కాపూర్ గ్రామ భూ నిర్వాసితులకు 123 జీవోతో పాటు R&R (పునరావాసం–పునరావాస పునరుద్ధరణ) ప్యాకేజీ అందించాలని కోర్టు ఆదేశించడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. ఎన్నో ఏళ్లుగా భూములు కోల్పోయి న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితుల పోరాటానికి ఈ తీర్పు ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
గతంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్ రావు, సిద్దిపేటలో భూ నిర్వాసితులకు అందించిన పరిహారం స్థాయిలోనే ఇక్కడ కూడా పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
Next Story




