Dubbak: పేదల సొంతింటి కల సాకారం.. రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు!

Dubbak: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట్ గ్రామంలో లబ్ధిదారు నిరుడి పుష్ప నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను వడ్ల నవీన్ కుమార్ ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 13 May 2026 7:11 PM IST
Dubbak
X

Dubbak: పేదల సొంతింటి కల సాకారం.. రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు!

Dubbak: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ప్రత్యేకంగా 5 లక్షల నిధులతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం చందాయిపేట్ గ్రామంలో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అదేశాల మేరకు లబ్ధిదారు నిరుడి పుష్ప నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం ప్రారంభించిన మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం.

అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందే వరకు మా కృషి కొనసాగుతుంది. ప్రజా పాలనలో పేదల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల ప్రెసిడెంట్ వడ్ల నవీన్ కుమార్ చందాయిపేట్ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, ఉపసర్పంచ్ నాగేష్ గుప్తా, పంచాయతీ సెక్రటరీ కృష్ణ,,చేగుంట ఉపసర్పంచ్ రఫీ, మార్కెట్ డైరెక్టర్ లు మహామ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story