Siddipet: హింసను ప్రేరేపిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.. కాంగ్రెస్ హెచ్చరిక

Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కాంగ్రెస్ నేత ఎనగంటి కిష్టయ్య మీడియా సమావేశం.

Chindam Karunakar, Dubbak
Published on: 3 May 2026 2:35 PM IST
Siddipet
X

Siddipet: హింసను ప్రేరేపిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.. కాంగ్రెస్ హెచ్చరిక

Siddipet: రైతులపై కపట ప్రేమ చూపుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లినట్లు ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎనగంటి కిష్టయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి వేస్తే ఊరే అని మాట్లాడిన బి.ఆర్.ఎస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.

అధికారిక ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మైకులను విసిరి కొట్టడం హింసను ప్రేరేపించడమే అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులను రెచ్చగొట్టి ధర్నాలు, రాస్తారోకోలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ బి.ఆర్.ఎస్ నాయకులు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించే బిఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story