Siddipet: కాంగ్రెస్, బిఆర్ఎస్ నాటకాలతో రాష్ట్రానికి నష్టం: దోనె అశోక్

Siddipet: తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల విమర్శలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలేనని జనసేన సిద్దిపేట జిల్లా నాయకులు దోనె అశోక్ మండిపడ్డారు.

RAJU, SIDDIPET
Published on: 5 Sept 2026 3:22 PM IST
Siddipet
X

Siddipet: కాంగ్రెస్, బిఆర్ఎస్ నాటకాలతో రాష్ట్రానికి నష్టం: దోనె అశోక్

Siddipet: ​తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీలు పరస్పరం 1000 రోజుల పాలనపై ఆరోపణలు, విమర్శలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించే నాటకమని జనసేన పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు, న్యాయవాది దోనె అశోక్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

గత బిఆర్ఎస్ పాలనలో జరిగిన పొరపాట్లు నుండి, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరని హామీల నుంచి ప్రజలను రక్షించాల్సింది పోయి, ఇరు పార్టీల నాయకులు విమర్శలకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల అమలులో జాప్యం జరుగుతోందని, రైతులకు, నిరుద్యోగులకు సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు.

G. O No. 22a ద్వారా సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు వీట్నీ పట్టించు కోకుండా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని, వీళ్లిద్దరి దోరణి చూస్తుంటే ఇద్దరూ ప్రజాధనాన్ని, ప్రజా నమ్మకాన్ని వమ్ము చేసినవారేనని" స్పష్టంగా ప్రజలకు అర్థం అవుతుందని ఇద్దరు దొంగలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని పరిస్పర విమర్శలు చేసుకుంటూ ప్రజా దానాన్ని మరియు విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల అభివృద్ధికి వెనుకకు నెట్టేసి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.

రాష్ట్రములో సూపరి పాలనా, గ్రామ స్వరాజ్యం మరియు రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు మరియు రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది కేవలం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల ప్రకారం, జనసేన పార్టీ ద్వారానె సాధ్యం అవుతుంది అని తెలియజేశారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story