Siddipet: సిద్దిపేటలో కలెక్టర్ హైమావతి కీలక సమీక్ష!

Siddipet: సిద్దిపేట కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ హైమావతి సమీక్ష; భూ భారతి రీ-సర్వే, సాదాబైనామ దరఖాస్తులు, భూ సేకరణను వేగవంతం చేయాలని ఆదేశం.

RAJU, SIDDIPET
Published on: 28 Aug 2026 7:10 AM IST
Siddipet
X

Siddipet: సిద్దిపేటలో కలెక్టర్ హైమావతి కీలక సమీక్ష!

Siddipet: గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో పలు అంశాల పైన ఆర్డీవోలు, తహశీల్దార్లతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి జూమ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం అమలు పరచడం లో అత్యంత కీలకం భూ భారతి రీ-సర్వే ప్రక్రియ నిర్ణిత కాలవ్యవధిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రీ-సర్వే లో సర్వే అధికారులు, తహశీల్దార్లు, గ్రామ సభలు నిర్వహించి అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

భూ భారతి రెవెన్యూ సదస్సులు వచ్చిన అప్లికేషన్ లు డిస్పోసల్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సాధబైనమా అప్లికేషన్లు పూర్తిగా వెరిఫై చేసుకొని, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చెక్ చేసుకోవాలని ఆదేశించారు.

22(ఏ) కి సంబంధించి పేపర్ లో వచ్చిన వార్తలకు ఆయా మండలాల వారిగా రిజెండర్ పంపించాలని తహసిల్దార్లను, ఈ వార్త కథనాలను మానిటర్ చేస్తూ రిపోర్ట్ పంపించాలని ఆర్డీఓ లను ఆదేశించారు. 22(ఏ) నాన్ అగ్రికల్చర్ సంబంధించిన వాటిని కరెక్ట్ గా వెరిఫై చెయ్యాలని తహసిల్దార్ లను, ఆ రిపోర్ట్ లను ఆర్డీఓ పూర్తిగా చెక్ చేశాకే కలెక్టరేట్ కి పంపించాలని ఆదేశించారు.

జిల్లాలో దేవాదుల ప్రాజెక్ట్ తాపస్ పల్లి రిజర్వాయర్ కు సంబంధించి కొమురవెల్లి, కొండపాక, కుకునూరు పల్లి, చేర్యాల, మద్దూరు, దుల్మిట్ట ఇతర మండలాల్లో కాలువల భూ సేకరణ ప్రక్రియ గూర్చి సమీక్షిస్తూ ఆయా మండలాల గ్రామాల వారిగా సర్వే చేసి పూర్తిగా ఎస్టిమేట్ వేసి అవార్డ్ పాస్ చెయ్యాలని ఆర్డీఓ లను ఆదేశించారు.

గౌరవెల్లి రిజర్వాయర్ అక్కన్న పేట, కోహెడ మండలాల్లో కాలువల భూసేకరణ నిధులు విడుదల అయ్యాయని రైతులను పిలిచి నష్ట పరిహారం అందించాలని, మిగతా భూ సేకరణ సైతం సర్వే చేసి అవార్డ్ పాస్ చెయ్యాలని ఆర్డీఓను ఆదేశించారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story