Siddipet: దౌల్తాబాద్ లో గోదాములను పరిశీలిస్తున్న కలెక్టర్ హైమావతి
Siddipet: సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు.
Siddipet: దౌల్తాబాద్ లో గోదాములను పరిశీలిస్తున్న కలెక్టర్ హైమావతి
సిద్దిపేట: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగ వంతం చేయాలని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. దౌల్తాబాద్, కొండపాక, మిరు దొడ్డి మండలాల్లోని పలు గోదాములను ఆకస్మికంగా పరిశీలించారు. మిల్లులలో స్థలం కొరత వల్ల ధాన్యం దిగుమతిలో జాప్యం జరుగుతోందని గుర్తించిన ఆమె, ఈ సమస్య పరిష్కారానికి స్థానికంగా ఉన్న గోదాములను డంపింగ్ కేంద్రాలుగా వినియోగించుకోవాలని అధి కారులను ఆదేశించారు.
దౌల్తాబాద్ మార్కెట్ యార్డు లోని గోదాములను కలెక్టర్ పరిశీలించారు. మిరుదొడ్డి మండలం అల్వాల గోదాములోని రేకుల మధ్య గ్యాప్ లేకుండా చూసి వెంటనే నిల్వకు సిద్ధం చేయాలని తహ సీల్దార్లకు సూచించారు. కొండపాక గోదామును శుభ్రం చేసి స్థానిక కేంద్రాల నుంచి ధాన్యం తరలించాలని ఆదే శించారు. అకాల వర్షాల బారిన పడకుండా ధాన్యాన్ని భద్రపరచాలని, తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని స్పష్టం.




