Cheryal: కంపు కొడుతున్న చేర్యాల పెద్ద చెరువు కట్ట ప్రాంతం
Cheryal: చేర్యాల పెద్ద చెరువు కట్టపై చెత్త, చనిపోయిన మూగజీవాల వల్ల తీవ్ర దుర్వాసన. వాకర్స్, స్థానికుల అవస్థలు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
Cheryal: కంపు కొడుతున్న చేర్యాల పెద్ద చెరువు కట్ట ప్రాంతం
చేర్యాల: చేర్యాల పట్టణానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు కట్ట పై వందలాది స్థానికులు ఉదయం పూట కొంత మంది సాయంత్రం పూట వాకింగ్ చేస్తుంటారు. కొంత మంది సాయంత్ర సమయాన కుటుంబ సమేతంగా అహల్లాద కోసం చెరువు కట్ట పై వచ్చి సేదతీరుతారు.
కానీ కట్ట పై వేస్తున్న చెత్త చేదారం తో పాటు చనిపోయిన మూగ జీవాలను చెరువు పక్కన వేయడం తో కుళ్ళి దుర్గంధం వేదలడంతో మార్నింగ్ వాకర్స్ కు సాయంత్రం సేద తీరాడా నికి వచ్చిన స్థానికులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది.
మున్సిపల్ అధికారులకు వాకర్స్ అసోసియేషన్ వారు ఎన్ని సార్లు ఫోన్ చేసి పరిస్థితి నివివరించిన పట్టించు కున్న పాపానపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story




