Siddipet: భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు.. దుబ్బాకలో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం!

Siddipet: దుబ్బాక పట్టణంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహ మండప నిర్మాణానికి కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.

Chindam Karunakar, Dubbak
Published on: 12 April 2026 1:09 PM IST
Siddipet
X

Siddipet: భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు.. దుబ్బాకలో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక పట్టణ కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి దేవాలయం నవగ్రహ మండప స్థాపనకై భూమి పూజ చేసిన మన ప్రియతమ నాయకులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, వైస్ చైర్మన్ బొంగరం బాల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, దుబ్బాక పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దుబ్బాక పరశురాములు, 18 వ వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్, 14వ వార్డు కౌన్సిలర్ తునికి సురేష్, కిసాన్ సేల్ జిల్లా నాయకులు మల్లు గారి రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు జిందం గాలయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ దాసారం లక్ష్మి, దుబ్బాక పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆలేటి సరోజన, జిల్లా సీనియర్ నాయకులు సోలిపేట ప్రసాద్ రెడ్డి కోమటిరెడ్డి పద్మా రెడ్డి గార్లు తదితరులు ఉన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story