Thoguta: తోగుటలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

Thoguta: సిద్దిపేట జిల్లా తోగుటలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లను దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 23 May 2026 10:27 AM IST
Thoguta
X

Thoguta: తోగుటలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి!

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వారు శాలువాతో సన్మానం చేశారు, అలాగే మాట్లాడుతూ పేదోడి సొంతింటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవాడు లేకుండా చేసే వరకు నిద్రపోనాని అన్నారు.

కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్),మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి,సర్పంచులు పాగల శోభా కొండల్ రెడ్డి, రాంపురం రమేష్, లాచోళ్ళ రవీందర్, ఉపసర్పంచ్లు అమరేందర్,తిరుపతి,గౌస్, డైరెక్టర్ నరసింహారెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, శ్రీనకర్ రెడ్డి, మల్లారెడ్డి, మహిపాల్ రెడ్డి, భారత్ తేజ,రవీందర్, నర్సింలు, ఉపల్లయ్య, ప్రసాద్ రెడ్డి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story