Dubbak: ఇందిరమ్మ ఇల్లు.. గృహప్రవేశంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Dubbak: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పెద్ద ఆరెపల్లిలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Dubbak: ఇందిరమ్మ ఇల్లు.. గృహప్రవేశంలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
Dubbak: దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పెద్ద ఆరెపల్లి గ్రామంలో శ్రీమతి మనంజి శ్రావణి - రవి నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి దౌల్తాబాద్–రాయపోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలపురం కనకయ్య యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్, యువ నాయకులు జాల దుర్గ ప్రసాద్ ముదిరాజ్, పాల రామగౌడ్, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, మండల కోఆర్డినేటర్ గుంటి నర్సింలు, రెడ్డబోయిన గోపాల్, ముంగిసపల్లి ఉపసర్పంచ్ రాజు, రాయపోల్ వాలీబాల్ స్వామి, ఏఎంసీ డైరెక్టర్లు బాకీ మల్లేశం, పాల్గొన్నారు.




