Dubbaka: కళాకారుల జనగణన చైతన్య యాత్ర పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే జనగణనపై అవగాహన సదస్సు నిర్వహించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 23 May 2026 10:39 AM IST
Dubbaka
X

Dubbaka: కళాకారుల జనగణన చైతన్య యాత్ర పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక: సిద్దిపేట జిల్లా కలెక్టర్ , మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి గౌ" శ్రీ బిజ్జూరి రవికుమార్ DPRO/AD గారి ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపాలిటీ మండలం దుబ్బాక లో జనగణన ప్రోగ్రామ్ లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రజలకు మాట, పాటల ద్వారా జనగణన ప్రాముఖ్యత ను వివరించడమైనది.

ఈ సాంస్కృతిక కార్యక్రమానికి దుబ్బాక నియోజక వర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు, మునిసిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు,కౌన్సిలర్ లు మరియు దుబ్బాక ప్రజలు పాల్గొన్నారు.

ఈ కళాప్రదర్శన లో పాల్గొన్నా దుబ్బాక టీమ్ బిట్ల ఎల్లయ్య టీం లీడర్,ఆస రామారావు,కమ్మరి నర్సయ్య,పిల్లుట్ల ప్రకాష్,తుమ్మల ఎల్లయ్య,సందుర్ల శేఖర్,జినుక దేవదాసు,సిద్దిపేట టీం,వెంకటాపురం రవి టీం లీడర్,కొమ్ము రవీందర్,నీరటి రవీందర్,కొమ్ము ఎల్లం,ఎరుపుల తిరుమలయ్య,ముక్కపల్లి బాబాయి ( భార్గవి)తదితరులు పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story