Siddipet: ఖజీపూర్ హైస్కూల్ విద్యార్థుల పట్టుదల.. అదిరిపోయే సన్మానం
Siddipet: సిద్దిపేట జిల్లా బేగంపేట గ్రామానికి చెందిన ఖజీపూర్ హైస్కూల్ విద్యార్థులు SSC పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
Siddipet: ఖజీపూర్ హైస్కూల్ విద్యార్థుల పట్టుదల.. అదిరిపోయే సన్మానం
సిద్దిపేట జిల్లా: అక్బర్‌పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలోని ఖజీపూర్ హైస్కూల్‌లో SSC పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బేగంపేటకు చెందిన కడవెరుగు రమ్యశ్రీ, నిహారిక, పోతారం దీక్షిత్, నందిని, వర్షిత్, ఉమేష్, కిరణ్, అర్చన, యశ్వంత్‌లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి సాధించిన విజయాలు గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలు సాధించాలని వారికి ప్రోత్సాహం అందించారు.గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అభినందిస్తూ, ఇలాంటి విజయాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు.
Next Story




