Cherial: చేర్యాల ప్రయాణికులకు ఊరట.. ఉప్పల్‌కు నేరుగా బస్సు సౌకర్యం!

Cherial: చేర్యాల నుంచి హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డుకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషితో ఈ బస్సు అందుబాటులోకి వచ్చింది.

CHANDRAREDDY,	CHERIYAL
Published on: 28 Aug 2026 7:34 PM IST
Cherial
X

Cherial: చేర్యాల ప్రయాణికులకు ఊరట.. ఉప్పల్‌కు నేరుగా బస్సు సౌకర్యం!

చేర్యాల ఆగస్టు 28: చేర్యాల ప్రాంత ప్రజలు, ప్రయాణికుల రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఆర్టీసీ అధికారులతో చర్చించి ఈరోజు నుంచి చేర్యాల నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు బస్సు సౌకర్యాన్ని కల్పించారు.

ఈ కొత్త సర్వీసు వల్ల చేర్యాల, పరిసర ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా ఘట్కేసర్ లోని నీలిమ హాస్పిటల్ లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అందిస్తున్న ఉచిత వైద్యం కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరనున్నాయి. అలాగే హైదరాబాద్‌లోని ఉప్పల్ వైపు ప్రయాణం సులభతరం కానుంది. రోజువారీ పనులు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం నగరానికి వెళ్లే వారికి గణనీయమైన ఉపశమనం లభించనుంది.

చేర్యాల్ టు ఉప్పల్ బస్సు సౌకర్యం కల్పించడం కోసం నిరంతరం కృషి చేసిన జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తున్న ఆయనకు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

CHANDRAREDDY,	CHERIYAL

CHANDRAREDDY, CHERIYAL

Next Story